Home / TATA Group
Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. వ్యాపారాల కంటే కూడా దాన గుణంతోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సామాన్య జీవితం గడుపుతుంటారు రతన్ టాటా. కాగా నేడు 85వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనీ టాటాలకు ముంబయిలో జన్మించారు రతన్ టాటా. 1959లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందారు. 1991లో […]
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.
ఎయిర్‌ఏషియా ఏవియేషన్ గ్రూప్ లిమిటెడ్ , ఎయిర్‌లైన్స్ యొక్క ఇండియా కార్యకలాపాలలో తన మిగిలిన వాటాను టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు సుమారు $19 మిలియన్లకు విక్రయించినట్లు బుధవారం తెలియజేసింది.
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు
పల్లోంజీ షాపూర్ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్‌ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్‌ఘడ్ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు.