Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వానలే వానలు!

Rain Alert in Andhra Pradesh and Telangana States for Five Days: గత నెల రోజులుగా ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. భూ ఉపరితం హీట్ ఎక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మూడు నుంచి ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అదే విధంగా, ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే రేపు రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.