Motorola Edge 60 Fusion: మాయ చేసేందుకు సిద్దమైన మోటో.. రేపే ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫస్ట్ సేల్.. ‘అబ్బా’ అనేలా ఫీచర్లు..!

Motorola Edge 60 Fusion: మోటరోలా భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 2న దేశీయ మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్ ప్రవేశించనుంది. Motorola Edge 60 Fusion 5G మొబైల్ రేపు అధికారికంగా విడుదల కానుంది. స్టైలిష్ లుక్స్ గొప్ప ఫీచర్లతో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. రండి, ఈ మొబైల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
Motorola Edge 60 Fusion Launch Date
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ రేపు ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర, సేల్ వివరాలను కంపెనీ రేపు వెల్లడించనుంది. ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. మీరు మోటరోలా ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లాంచ్ ఈవెంట్‌ను కూడా చూడచ్చు.
Motorola Edge 60 Fusion Features
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G మొబైల్‌లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1.5K పిక్సెల్ రిజల్యూషన్‌తో ఫుల్ కర్వ్‌డ్ డిస్‌ప్లే. ఈ స్క్రీన్ గరిష్టంగా 4500 నిట్‌ల బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ కూడా ఉంది. ఈ 5G మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. భారతదేశంలో ఈ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్లతో వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్ లైట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 13-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా,మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌లో 256జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉండవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్‌లో 5,500mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఈ మొబైల్‌లో మోటో గెస్చర్, AI ఫీచర్ ఉంటుంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP69 రేటింగ్ అందించారు. ఇందులో వాటర్ టచ్ 3.0 ఫీచర్ ఉంది. కాబట్టి మీరు తడి చేతులతో కూడా ఫోన్‌ను ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- Apple Intelligence Update: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త అప్డేట్ వచ్చేసింది.. ఈ ఫీచర్లు చూస్తే షాక్..!