IPL 2025 : మహ్మద్ సిరాజ్‌కు 3 వికెట్లు.. గుజరాత్ లక్ష్యం 170

IPL 2025 : బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ గిల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతోపాటు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దీంతో ఫిల్ స్టాల్(14), కోహ్లీ (7), దేశ్‌దత్ పడిక్కల్ (4), రజిత్ పాటిదార్ (12)పరుగులకే వెనుదిరిగారు. లివింగ్ స్టోన్ (54) పరుగులు చేసి అదరగొట్టారు. జితేశ్ (33), టిమ్ డేవిడ్ (32) పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ (12) నిరాశ పర్చారు. గుజరాత్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీశాడు. అర్షద్, ఇషాంత్ చెరో వికెట్ పడగొట్టారు. బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.