DA Hike 2025: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఉద్యోగులకు డీఏ పెంపు

Govt announces 2% DA hike for central govt employees: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా 2 శాతం డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఏ పెంచేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53 శాతం డీఏ ఉండగా.. తాజాగా, కేంద్రం నిర్ణయంతో 55 శాతానికి చేరింది. ఏడో వేతన సవరణ సంఘం సూచనతో డీఏ పెంచినట్లు తెలుస్తోంది.
డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్.. 2 శాతం పెంచడంతో దాదాపు 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 66.55 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. అయితే గతంలో జులైలో డీఏ శాతం 3 శాతం పెంచింది. దీంతో 50 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. తాజాగా, మరో 2 శాతం పెంచడంతో 55 శాతానికి పెరగనుంది.
కేంద్రం పెంచిన డీఐ జనవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. అయితే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఐను కేంద్రం రెండు సార్లు సవరిస్తుంటుంది. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాటికి పరిహారంగా ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కేంద్రం డీఏ అందజేస్తుంది.