Published On:

Tamil Nadu govt Key Decision: తొలిసారి గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే 10 బిల్లులు ఆమోదం

Tamil Nadu govt Key Decision: తొలిసారి గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే 10 బిల్లులు ఆమోదం

10 Bills passed in Tamil Nadu Assembly without Governor and President Approval: పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వగా, తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సర్కారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

 

గవర్నర్ వద్దకు బిల్లలు..
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవికి ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా బిల్లులను తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు సర్కారు ఆరోపించింది. ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించకపోవడం, పున:పరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోనూ గవర్నర్ తీరు మారలేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

 

రాజ్యాంగ విరద్ధం..
తమిళనాడు శాసన సభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మత్రమేనని ధర్మాసనం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ రవికుమార్ నిర్దిష్ట గడువులోపు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

 

కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి..
గవర్నర్ పది బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్యని, అందుకే తోసిపుచ్చుతున్నామని జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండింగ్‌లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదేతొలిసారి. మంత్రిమండలి సూచనలు, సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా బిల్లును శాసనసభ తిరిగి పంపాలని సూచించింది.

 

గవర్నర్‌పై సమీక్ష జరపవచ్చు..
గవర్నర్ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సూచన మేరకు పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని పేర్కొంది. రాజ్యాంగంలోని 200వ అధికరణం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మకమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి: