Last Updated:

Hit 3 Director Tweet: నా సినిమా సేఫ్‌ – హీరో నాని సవాల్‌పై హిట్‌ 3 డైరెక్టర్‌ రియాక్షన్‌!

Hit 3 Director Tweet: నా సినిమా సేఫ్‌ – హీరో నాని సవాల్‌పై హిట్‌ 3 డైరెక్టర్‌ రియాక్షన్‌!

Hit 3 Director Tweet on Nani Statement at Court Event: కోర్టు సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హీరో నాని ఓ సవాలు చేశాడు. కోర్ట్‌ మూవీ నచ్చకపోతే.. తన హిట్‌ 3 సినిమా చూడకండని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్‌ 3 డైరెక్టర్‌ శైలేష్‌ కోలను స్పందించాడు. నా సినిమా సేఫ్‌ అంటూ ప్రభాస్‌ ఫోటోతో ఆసక్తి పెంచాడు. మార్చి 14 రేపు కోర్టు మూవీ రిలీజ్ సందర్భంగా బుధవారం ప్రీమియర్స్‌ ప్రదర్శించగా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

అలాగే డైరెక్టర్‌ శైలేష్ కోలను కూడా ఈ సినిమా చూసి కోర్టు మూవీపై ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. “నా సినిమా (హిట్‌ 3) సేఫ్‌. ‘కోర్టు: స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడి’ అనేది మొత్తం భావోద్వేగాలతో నిండిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ సినిమా ఇది. తప్పకుండ ఈ కోర్టు డ్రామా ప్రేక్షకులను నచ్చుతుంది. కోర్టుతో ప్రియదర్శి మరో హిట్‌ ఖాతాలో పడింది. చిత్ర బృందానికి నా అభినందలు. రేపు థియేటర్‌కు వెళ్లి కోర్టు చూడండి. ఇక నేను నా ఎడిట్‌ (హిట్‌ 3 ఎడిట్‌ రూం)కి వెళ్లాల్సిన టైం వచ్చింది. అందరికి గుడ్‌ నైట్‌” అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మిర్చి మూవీలోని ప్రభాస్‌ నా ఫ్యామిలీ సేఫ్‌ అనే చెప్పే సన్నివేశంలోని ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం శైలేష్‌ కోలను పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ప్రియదర్శి లీడ్‌ రోల్‌లో హర్ష రోషన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రలో సాయి కుమార్‌, శివాజీ, రోహిని, హర్షవర్ధన్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతోనే అతడు డైరెక్టర్‌ పరిచయం కాబోతోతున్నాడు. హీరో నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. రేపు రిలీజ్‌ సందర్బంగా నేడు(మార్చి 13) ప్రీమియర్స్‌ వేయగా.. సినిమా బాగుందంటూ సోషల్‌ మీడియా పాజిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. కోర్టు బ్యాకడ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కింది. ప్రస్తుతం శైలేష్ కోలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి: