Last Updated:

Deputy Cm Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Deputy Cm Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Deputy Cm Pawan Kalyan Reaction on Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చేసిన అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ చిట్ చాట్‌లో సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై మాట్లాడారు. పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. రేవతి మృతి చెందిన తర్వాత బాధిత కుటుంబం వద్దకు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు. థియేటర్ వద్ద జరిగిన పొరబాటును హీరోపైనే వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని వివరించారు.

అల్లు అర్జున్ అరెస్టులో రేవంత్ రెడ్డి విధానం కనిపించిందని, ఎవరి విషయంలో అయినా ఆయన విధానం అదేనని స్పష్టం చేశారు. అంతకుముందు ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారన్నారు. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంపుతో పాటు అదనపు షోలకు సైతం అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదన్నారు. రేవంత్ ఆ స్తాయి దాటిన బలమైన నేత అని వెల్లడించారు.అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారన్నారు.