Last Updated:

Rajagopal Reddy: మునుగోడు ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు

తెలంగాణలోని రాజకీయ పార్టీ నేతలంతా ఇప్పుడు మునుగోడు బైపోల్స్ ను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టు మాటలతూటాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. కాగా తాజాగా మునుగోడు ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది.

Rajagopal Reddy: మునుగోడు ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు

Rajagopal Reddy: తెలంగాణలోని రాజకీయ పార్టీ నేతలంతా ఇప్పుడు మునుగోడు బైపోల్స్ ను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టు మాటలతూటాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ రోజు ఏం జరుగుతుందాని యావత్ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా మునుగోడు ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది.

ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై ఈసీ నోటీసులు జారీ చేసింది. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. రాజగోపాల్ రెడ్డి మరియు ఆయన కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై నేటి సాయంత్రం 4గంటలలోపు సమాధానం చెప్పాలని ఉత్తర్వులలో పేర్కొనింది. సోమవారం అనగా నేటి సాయంత్రంలోపు సరైన వివరణ ఇవ్వకుంటే ఈ వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకొంటామని ఈసీ స్పష్టం చేసింది. సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన 23 ఖాతాలకు
ఈనెల 14,18,29 తేదీల్లో వేల కోట్ల నగదు బదిలీ అయినట్టు శనివారం నాడు ఆధారాలతో సోమ భరత్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి ఒళ్లు మ‌రిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతుంది.. జర ఆలోచించండి- సీఎం కేసీఆర్

ఇవి కూడా చదవండి: