Home / Telangana latest news
Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. వారి పాలిట లారీలే యమపాశాలుగా మారాయి. ఎందుకంటే ఈ ఘటనలు సంభవించడానికి లారీలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
కల్లుగీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిసి ప్రారంభించారు.
బీజేపీ నేతలపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 5,7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు ధ్వంసం అయ్యాయి. షార్ట్ సర్య్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఏపీలో మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలబడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.