AP Politics : ఏపీ రాజకీయాల్లోకి కొత్త పార్టీ.. విజయవాడలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు
ఏపీ రాజకీయాల్లోకి తాజాగా కొత్త పార్టీ రాబోతుంది. మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని, పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నా రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటు కానుంది. కాగా ఈ మేరకు ఈరోజు విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
AP Politics : ఏపీ రాజకీయాల్లోకి తాజాగా కొత్త పార్టీ రాబోతుంది. మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని, పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నా రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటు కానుంది. కాగా ఈ మేరకు ఈరోజు విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. జూలై 23న కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అవినీతి, హత్య, ఫ్యాక్షన్, వెన్నపోటు రాజకీయాలను పారదోలి నూతన రాజకీయ వ్యవస్థ కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ప్రజా చైతన్య వేదికపై లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు. రాజకీయ గ్రహనాలు వదిలించడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలో భారీ సభ జరిపి నూతన పార్టీ పేరు, జెండా ప్రకటిస్తామన్నారు. నూతన పార్టీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తామని నారగోని, రామచంద్ర యాదవ్ వెల్లడించారు.
ఇతర పార్టీల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ లోకి రానున్నారని వెల్లడించారు. బహుజనుల హక్కుల కోసం తాము నూతనంగా స్థాపించబోయే పార్టీ పని చేస్తుందని వెల్లడించారు. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యం చేస్తామన్నారు. వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంక్‌గా ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని నేతలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ.. ఒకే జెండా ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ, టీడీపీలు బీసీలకు అన్యాయం చేశాయన్నారు.
కాగా రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం Y + కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఏపీలో అధికార పార్టీ అడ్డంకులతో రామచంద్ర యాదవ్ 022 డిసెంబర్ 4న సదుంలో రైతుభేరి బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తే.. పోలీసులు దానిని అడ్డుకున్నారు. అదే రోజు తన ఇంటిపై దాడి జరిగింది. అందుకు గాను తానకు రక్షణ కల్పించాలని అమిత్ షా ని లెటర్ రాయగా.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని కల్పించింది.