Published On:

CRPF Jawan Arrested: పాక్ కు గూఢచర్యం.. సీఆర్పీఎఫ్ జవాన్ అరెస్ట్!

CRPF Jawan Arrested: పాక్ కు గూఢచర్యం.. సీఆర్పీఎఫ్ జవాన్ అరెస్ట్!

NIA arrested CRPF Jawan Arrested for Spying for Pakistan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. కాగా దేశ భద్రత విషయాలను పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు రహస్య సమాచారన్ని అందించిన కేసులో సీఆర్పీఎఫ్ జవాన్ మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ పలు కీలక విషయాలను వెల్లడించింది. 2023 నుంచి మోటి రామ్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడని, అతడు కొంత కాలంగా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ అధికారులతో పంచుకునేవాడని తెలిపింది. పాక్ కు సమాచారం ఇచ్చినందుకు.. అతడికి వివిధ మార్గాల ద్వారా డబ్బులు వచ్చినట్టు ఎన్ఐఏ తెలిపింది.

కేసును విచారిస్తున్న ఎన్ఐఏ అధికారుల బృందం పూర్తి ఆధారాలతో.. న్యూఢిల్లీలో మోటి రామ్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతడిని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతడిని జూన్ 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించేలా తీర్పు వెల్లడించింది. ఎన్ఐఏ దర్యాప్తులో మోటి రామ్ ఎలాంటి విషయాలు పాక్ కు అందిచాడో బయటకు రానున్నాయి.