Home / Bangladesh
India opt to bowl against defending champions Bangladesh: దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తుదిసమయం ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. కాగా, గత ఆసియా కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు సెమిస్లో తలపడగా.. భారత్ ఓటమి చెంది ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ గెలవగా.. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ఆసియా […]
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.
బంగ్లాదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), శుక్రవారం నలుగురి ప్రాణాలను బలిగొన్న ప్యాసింజర్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంపై యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో దర్యాప్తును డిమాండ్ చేసింది. పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ రుహుల్ కబీర్ రిజ్వీ దీనిని మానవత్వంపై క్రూరమైన దౌర్జన్యం గా అభివర్ణించారు.
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అతని మద్దతుదారులు దీనిని రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించారు.
బంగ్లాదేశ్‌లోని వేలాది మంది గార్మెంట్ కార్మికులు సోమవారం కనీస వేతనాలను మూడు రెట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ నిరసనలు ఫ్యాక్టరీల ధ్వంసానికి దారితీయడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించి చెదరగొట్టారు,
బంగ్లాదేశ్‌లోని ఈశాన్య కిషోర్‌గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొనడంతో సోమవారం 20 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.రాజధాని ఢాకాకు 60 కిలోమీటర్ల దూరంలోని కిషోర్‌గంజ్ జిల్లాలోని భైరబ్ ప్రాంతంలో మధ్యాహ్నం 3.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢాకా వెళ్లే ఎగరోసిందూర్ గోధూలీ ఎక్స్‌ప్రెస్ వెనుక కోచ్‌లను ఛటోగ్రాం వైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.
బంగ్లాదేశ్‌లోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోవడంతో 17 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.బాధితుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో దశాబ్దం తర్వాత ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. దీంతో దేశంలో తరచూ కరెంటు కోతలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇంధన కొరతతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు.. మరో పక్క కరెంటు కోతలతో బంగ్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.
రైల్వే నెట్‌వర్క్‌ను పెంపొందించడానికి భారతదేశం బహుమతిగా ఇచ్చిన 20 బ్రాడ్ గేజ్ రైల్వే లోకోమోటివ్‌లు మంగళవారం సాయంత్రం బెంగాల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించాయి.నదియాలోని గెడే స్టేషన్ సమీపంలో పార్క్ చేయబడిన, లోకోలు సాయంత్రం ఢిల్లీ నుండి బయలు దేరాయి.