Published On:

Bangladesh : 2026 జూన్‌లోగా బంగ్లాదేశ్ ఎన్నికలు : తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్

Bangladesh : 2026 జూన్‌లోగా బంగ్లాదేశ్ ఎన్నికలు : తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్

Bangladesh elections by June 2026 : బంగ్లాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సద్దుమణిగేలా లేదు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య ఎప్పుడైనా బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని ప్రకటించారు.

 

జపాన్‌ పర్యటనలో ఉన్న యూనస్ తాజాగా టోక్యోలో మాట్లాడారు. బంగ్లాలో ఎన్నికల నిర్వహణలో రాజకీయ వర్గాల్లో అసహనం నెలకొన్నదని చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. అప్పుడే వారికి తాము బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి 2026 జూన్‌ మధ్యలో ఎ‍న్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంస్కరణలు ఎంత త్వరగా చేయగలమనే దానిపై నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు.

 

ఎన్నికల సంస్కరణలు నెమ్మదిగా సాగితే నిర్వహణకు అధిక సమయం పడుతుందని చెప్పారు. 2026 జూన్ నాటికి నిర్వహించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ నాటికి బంగ్లాలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఢాకాతోపాటు పలు నగరాల్లో బీఎన్‌పీ పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించింది. ఎన్నికలను వాయిదా వేయొద్దని తాత్కాలిక ప్రభుత్వాన్ని బీఎన్‌పీ నేత తారిఖ్ రెహమాన్ కోరారు.

ఇవి కూడా చదవండి: