Last Updated:

Australia: బ్యాంకు అక్కౌంట్లో 8 వేలకు బదులుగా రూ.82 కోట్లు జమ.

ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమకావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.

Australia: బ్యాంకు అక్కౌంట్లో 8 వేలకు బదులుగా రూ.82 కోట్లు జమ.

Australia: ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబానికి వారి బ్యాంక్ అక్కౌంటులో పొరపాటున $100కి బదులుగా $10.4 మిలియన్లు జమ కావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇపుడు వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించాలి.

మెల్‌బోర్న్‌లో నివాసముంటున్న తేవమనోగారి మణివేల్ మరియు ఆమె సోదరి, వారి బ్యాంక్ ఖాతాలో $10,474,143 బ్యాలెన్స్ కనిపించడంతో వారు అవాక్కయ్యారు. సింగపూర్ ఆధారిత ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వారి ఖాతాలో అదనపు డబ్బు జమకావడం పొరపాటున జరిగిందని వారికి మొదట్లో తెలియదు. Crypto.com దాదాపు ఏడు నెలల తర్వాత ఆడిట్ సమయంలో వారి తప్పును గుర్తించిన తర్వాత వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. మణివేల్ మరియు ఆమె సోదరి ఇప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించారు.

అయితే ఇంతపెద్ద మొత్తంలో డబ్బు జమ కావడం పై దర్యాప్తు చేయడానికి బదులుగా వారు డబ్బును ఖర్చు చేయడం ప్రారంభించారు. మణివేల్ తన కుటుంబసభ్యులతో సహా మరో ఆరుగురికి నగదు బహుమతిగా ఇవ్వడం ద్వారా ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు ఆమె నాలుగు బెడ్‌రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లను కలిగి ఉన్న ఒక భవనం పై $1.35 మిలియన్లను ఖర్చు పెట్టారు. ఆడిట్ తప్పు బయటపడేవరకు కుటుంబం ఏడు నెలల పాటు ఉన్నత జీవితాన్ని గడిపింది.

తాజాగా న్యాయపరమైన చర్యలు మణివేల్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీశాయి. డైలీ మెయిల్ ఆస్ట్రేలియా ప్రకారం తాజా పరిణామం ఏమిటంటే, విక్టోరియన్ సుప్రీంకోర్టు గత శుక్రవారం, ఆగస్టు 26న Crypto.comకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంటే మణివేల్ మరియు ఆమె కుటుంబం ఇంటి మొత్తం ఖర్చుతో పాటు వడ్డీతో కలిపి $1.35 మిలియన్ల వరకు తిరిగి చెల్లించాలి.

ఇవి కూడా చదవండి: