Israel : ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంలో ఎగిసిపడుతున్న మంటలు

Massive forest fire in Jerusalem Suburbs : ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు చెలరేగింది. జెరూసలెం శివారులోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే వేలాది మంది తమ ఇండ్లను ఖాళీ చేశారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు కారణం వల్ల 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వాతావరణం పొడిగా ఉండడం, బలమైన గాలులతో మంటలు వేగంగా వ్యాప్తిచెందుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్..
ఎగిసిపడుతున్న మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై కొందరు తమ వాహనాలు విడిచి వెళ్లడం.. పరుగులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. ఈ క్రమంలోనే దేశంలో అత్యవసర పరిస్థితి కూడా ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు.
రంగంలోకి సైన్యం..
ఎగిసిపడుతున్న మంటలు జెరూసలెం నగరానికి వ్యాప్తి చెందోచ్చని ఆ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరికాలు జారీచేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రోడ్లును మూసివేశారు. సహాయక చర్యల కోసం సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.