Published On:

Saudi Arabia : ప్రపంచ తొలి ‘ఏఐ డాక్టర్!’.. సౌదీ అరేబియాలో ప్రారంభం

Saudi Arabia : ప్రపంచ తొలి ‘ఏఐ డాక్టర్!’.. సౌదీ అరేబియాలో ప్రారంభం

Saudi Arabia : కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే మొదటిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామం ద్వారా అల్‌మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీని అందుబాటులోకి తెచ్చింది. సౌదీ అరేబియాలోని అల్ అహ్సా ప్రావిన్స్‌లో ఏర్పాటు అయ్యింది. రోగులతో తొలుత సంభాషించి, వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి మైద్యులను తప్పించడం దీన్ని ఉద్దేశం. ‘ఏఐ క్లినిక్ వినూత్న వైద్య సేవా వ్యవస్థ అని సైన్యీ సంస్థ తెలిపింది. ఇందులో ఏఐ వ్యవస్థ స్వతంత్రంగా వివరాల సేకరణ నుంచి మందులు సూచించడం వరకు పలు సేవలు అందిస్తుందని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. వారు వ్యాధి నిర్ధారణ, చికిత్స ఫలితాలను సమీక్షిస్తారని ఆ సంస్థ పేర్కొంది.

 

వైద్య రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలు..
రోజురోజుకూ వైద్యరంగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. చివరకు మనుషులు చేసే పనిచేసే పనులు యంత్రాలు చికిత్స చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సౌదీ అరేబియాలో జరుగుతున్న ఓ ప్రయోగం ఇందుకు ఉదాహరణ. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐ ఆధారంగా రోగులకు వైద్యసేవలు అందించే క్లినిక్ సౌదీలో ప్రారంభమైంది. వైద్య చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది.

 

పనిచేసేదిలా!..
ఏఐ వైద్య వ్యవస్థకు ‘డాక్టర్ హువా’ అని పేరు పెట్టారు. క్లినిక్‌కు వచ్చిన తర్వాత ఒక ట్యాబ్ సాయంతో ఏఐకి తమ వ్యాధి లక్షణాలను రోగి వివరించాలని సైన్యీ ఏఐ తెలిపింది. వెంటనే అది మరిన్ని ప్రశ్నలు సంధిస్తుందని తెలిపింది. మానవ సహాయకుల సాయంతో సేకరించిన డేటా, చిత్రాలను విశ్లేషిస్తుందని వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే డాక్టర్ హువా ఇక చికిత్స ప్రణాళికను అందిస్తుందని పేర్కొంది. దీన్ని వైద్యుడు కూలంకషంగా సమీక్షించి, సంతకం చేస్తారని తెలిపింది. ఏఐ పరిశీలించలేని అత్యవసర కేసుల కోసం వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొంది. ఏఐ డాక్టర్ ద్వారా ఉబ్బసంతోపాటు దాదాపు 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించిన కన్సల్టేషన్ సేవలను అందిస్తున్నారని తెలిపింది. వైద్యుల డేటాబేస్‌ను విస్తరించి, 50 శ్వాస, జీర్ణకోశ, చర్మ సంబంధ వ్యాధులకు సేవలను అందించాలని భావిస్తున్నట్లు సైన్యీ ఏఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి: