Fish-Curd : చేపలు , పెరుగు కలిపి తీసుకుంటే ఈ సమస్యలను స్వాగతించినట్లే !
పెరుగు, చేపల కలిపి తినడం వల్ల ఈ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ తప్పవు.మన చిన్నతనం నుంచి చేపలతో పాలు లేదా పెరుగు కలిపి తినకూడదని వింటుంటాము.
Fish-Curd: పెరుగు, చేపల కలిపి తినడం వల్ల ఈ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ తప్పవు.మన చిన్నతనం నుంచి చేపలతో పాలు లేదా పెరుగు కలిపి తినకూడదని వింటుంటాము. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్లు చెబుతుంటారు.ఐతే సైన్స్ దీని గురించి ఏమి చెబుతుంటే పెరుగు, చేపలు రెండూ కూడా పోషకాలతో కూడిన ఆహారాలు.కాబట్టి చేపలో ప్రోటీన్లు, అనేక రకాల విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మొదలైనవి పుష్కలంగా దొరుకుతాయి.పెరుగులో అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ప్రోటీన్, వంటివి పుష్కలంగా ఉంటాయి.
ఈ రెండింటిలో కూడా వివిధ రకాల ప్రొటీన్లు ఉంటాయి.ఆ రెండు రకాల ప్రొటీన్లు మనం ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది.దాని వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. దీని కారణంగా చర్మం పై దద్దుర్లు, దురదలు వస్తాయి.పెరుగు, చేపలను కలిపి తీసుకొని తింటే అందరికి పడదు.కొందరి ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తుంది.
పెరుగు, చేపలను ఎక్కువ తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవు.. తర్వాత కళ్ల నుంచి నీరు కారడం, కళ్ళు మండటం ఇలాంటి సమస్యలు రావచ్చని నిపుణులు వెల్లడించారు.ఇది మాత్రమే కాదు, ఇది సంతానోత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుంది.