Published On:

Sreeleela: కిస్సిక్ బ్యూటీకి చేదు అనుభవం.. అందరి ముందు చెయ్యి పట్టుకొని లాగి..

Sreeleela: కిస్సిక్ బ్యూటీకి చేదు అనుభవం.. అందరి ముందు చెయ్యి పట్టుకొని లాగి..

Sreeleela: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. హీరోయిన్స్ అనే కాదు.. హీరోలకు కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా బయట ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు అభిమానులు చేసే హంగామా అంతాఇంతా కాదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ ను చూడడానికి, తాకడానికి వారు పడే పాట్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి.

 

ఇక అలాంటి అభిమానుల మధ్యలో హీరోయిన్ రావడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే బౌన్సర్లు చుట్టూ కాపాలా  కాస్తూ ఉంటారు. అయినా అభిమానని బౌన్సర్లు ఆపలేరు అన్నట్లు.. వారిని తప్పించుకొని మరీ హీరోయిన్లను తాకడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనివలన చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారు.

 

తాజాగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. ప్రస్తుతం శ్రీలీల.. బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది. ఇక షూటింగ్ ముగించుకొని వస్తుండగా.. వారిని చూడడానికి ఫ్యాన్స్ గుమిగూడారు.

 

ఈ నేపధ్యంలోనే క్రౌడ్ లో ఒక ఆకతాయి శ్రీలీల చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగారు. దీంతో శ్రీలీల షాక్ కు గురైంది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. హీరోయిన్స్ పట్ల ఇలా చేయడం తగదని, వారికి కూడా ప్రైవసీ ఇవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు.