Published On:

Honda Teases X-ADV 750: ఏముంది రా బండి.. హోండా అడ్వెంచర్ స్కూటర్.. యమ కిక్కు ఇస్తున్న లుక్..!

Honda Teases X-ADV 750: ఏముంది రా బండి.. హోండా అడ్వెంచర్ స్కూటర్.. యమ కిక్కు ఇస్తున్న లుక్..!

Honda Teases X-ADV 750: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన X-ADV 750 అడ్వెంచర్ స్కూటర్ టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, రెబెల్ 500 క్రూయిజర్ లాంచ్ అయిన ఒక రోజు తర్వాత ఈ టీజర్ విడుదలైంది. ఈ టీజ్‌తో కంపెనీ మరోసారి ప్రజలను ఆశ్చర్యపరిచింది. హోండా ఇండియా బిగ్‌వింగ్ సోషల్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన టీజర్ రాబోయే రోజుల్లో ప్రీమియం X-ADVని ప్రారంభించవచ్చని సూచిస్తుంది. కంపెనీ దీనిని ‘గేమ్ ఛేంజర్’ తో టీజ్ చేసింది.

 

ప్రపంచ మార్కెట్లలోని మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా X-ADV 750 అత్యంత ప్రత్యేకమైన ఆఫర్‌లలో ఒకటి. ఇది అడ్వెంచర్ ట్రావెట్ ఎబిలిటీ స్కూటర్, రోజువారీ అవసరాలు,సౌకర్యంతో మిళితం చేస్తుంది. భారతదేశం కోసం టీజ్ చేసిన మోడల్ గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త జనరేషన్ వెర్షన్ లాగా కనిపిస్తోంది. అప్‌డేటెడ్ ఫీచర్లు, కొత్త కలర్ ఎంపికలు ఉంటాయి.

 

హోండా X-ADV 750లో 745సీసీ సమాంతర-ట్విన్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 58 బిహెచ్‌పి పవర్, 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) తో జతచేసి ఉంటుంది. దేశంలో అరుదైన స్కూటర్‌గా నిలిచింది. బలమైన అండర్‌పిన్నింగ్స్‌లో 17-అంగుళాల ముందు, 15-అంగుళాల వెనుక వైర్-స్పోక్ వీల్స్, ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇవన్నీ తేలికపాటి ఆఫ్-రోడ్, టూరింగ్ సామర్థ్యం కోసం రూపొందించారు.

 

దీని ఫీచర్లలో ఎల్ఈడీ లైటింగ్, అడ్జస్ట్ చేయగల విండ్‌స్క్రీన్, పెద్ద డిజిటల్ డిస్‌ప్లే, మల్టీ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇది అడ్వెంచర్, కంఫర్ట్ , అర్బన్ వంటి వివిధ అనుబంధ ప్యాక్‌లతో కూడా అందించారు. భారత మార్కెట్ కోసం హోండా దీన్ని ఎలా ప్యాకేజీ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటివరకు, హోండా యాక్టివా, డియో, ఇటీవల ప్రారంభించిన యాక్టివా ఎలక్ట్రిక్ వంటి మోడళ్లు భారతదేశంలోని కమ్యూటర్ స్కూటర్ మార్కెట్‌లో ఆధిపత్యం చేలాయిస్తున్నాయి.

 

ప్రీమియం, లైఫ్ స్టైల్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో కంపెనీ తన మార్గాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. వరుసగా విడుదలైన రెబెల్ 50, X-ADV టీజర్లు, హోండా తన బిగ్‌వింగ్ నెట్‌వర్క్ ద్వారా భారతదేశంలో ప్రీమియం సెగ్మెంట్‌లోకి ప్రవేశించడం గురించి చివరకు తీవ్రంగా ఆలోచిస్తోందని చూపిస్తుంది. X-ADV 750 ఇప్పటికే భారతీయ రోడ్లపై పూర్తిగా రోడ్-లీగల్ రూపంలో కనిపించింది.అయితే ఇది ప్రైవేట్ యాజమాన్యంలోని ఎగుమతి యూనిట్‌గా చెబుతున్నారు.