Posani Krishna Murali : మరోసారి కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణ మురళి.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?
పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు. తెలుగు ఇండస్ట్రిలో రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.
Posani Krishna Murali : పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు. తెలుగు ఇండస్ట్రిలో రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టి వైఎస్సార్సీపీకి మద్దతుగా కొనసాగుతున్నారు. కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా పోసాని మరోసారి కరోనా బారినపడ్డారని తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన పోసాని గురువారం (ఏప్రిల్13) హైదరాబాద్‌కు వచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కాగా ఆయన మహమ్మారి బారిన పడడం ఇది మూడోసారి. ఇప్పుడు మరోసారి కరోనా లక్షణాలతోనే హాస్పిటల్ లో చేరడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
దేశ వ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణలోనూ క్రమంగా కొవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం (ఏప్రిల్ 13) న రాష్ట్ర వ్యాప్తంగా 45 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 18 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.