jayam Ravi Mother in Law: ముదురుతున్న కుటుంబ వివాదం – అతడి కోసం రూ. 100 కోట్లు అప్పు చేశా.. జయం రవి అత్త షాకింగ్ కామెంట్స్

Jayam Ravi Mother in Law Shocking Post: కోలీవుడ్ నటుడు రవి మోహన్ (‘జయం’ రవి) కుటుంబ వివాదంలో రోజురోజుకి ముదురుతోంది. గతేడాది భార్య ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసింది. ప్రస్తుతం వీరి విడాకుల ప్రాసెస్ జరుగుతుంది. డైవోర్స్ అనౌన్స్మెంట్ నుంచి జయం రవి తరచూ తన వ్యక్తగతి విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల గాయన కెన్నీషాతో ఓ వేడుకలో జంటగా కనిపించాడు. ఆయన భార్య ఆర్తి.. అతడిని విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. భార్యకు కౌంటర్ జయం రవి కుడా సుధీర్ఘ పోస్ట్ పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ వివాదంలో ‘జయం’ రవి అత్త, ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చారు.
తన అల్లుడి కోసం వందల కోట్లు అప్పు చేశానని, ఆ వడ్డీలు కూడా తానే కట్టుకున్నానన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చూస్తు ఉండిపోయాడు కానీ, ఏ సాయం చేయలేదని ఆమె అన్నారు. అతడిని అల్లుడి కాకుండ ఓ కొడుకులా చూశానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. “గత 25 ఏళ్లుగా నేను నిర్మాతగా రాణిస్తున్నాను. 2007లో సుందర్ సి లీడ్ రోల్లో వీరప్పు మూవీ చేశాను. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. లాభాలు కూడా బాగానే వచ్చాయి. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలోకి అడుపెట్టాను.
‘జయం’ రవి వల్ల మళ్లీ నిర్మాతగా సినిమాల్లోకి వచ్చాను. ఆ తర్వాత చేసిన సినిమా పెద్ద వర్కౌట్ కాలేదు. కానీ మళ్లీ నిర్మాతగా ప్రయత్నించమని రవి సలహా ఇచ్చాడు. వరుస ప్లాప్స్. వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అడంగ మరు, భూమి, సైరన్ చిత్రాలు చేశాడు. ఆయా సినిమాల్లో అతడు హీరో. అప్పుడే రూ. 100 కోట్లు అప్పుడ తీసుకున్నాడు. అందులో నుంచి జయం రవికే 25 శాతం పారితోషికం ఇచ్చాను. ఇవి సరిగా ఆడలేదు. దీంతో అప్పుల్లో కురుకుపోయాను. వడ్డీలు కట్టుకున్నాను. కానీ రవి ఏనాడు సాయం చేయలేదు. ఈ నష్టాన్ని పూడ్చడానికి నా నిర్మాణంలో మరో సినిమా చేస్తానననాడు. కానీ ఇప్పటి వరకు ఏ సినిమాకు సంతకం చేయలేదు. అయినా నేను తనని నుంచి ఎప్పుడు ఏం ఆశించలేదు.
ఎందుకంటే అతడిని అల్లుడిగా కాదు.. కొడుకులా భావించాను. తను ఆనందం ఉండాలని అనుకున్నా. డబ్బులతో ఇబ్బంది పడోద్దని ఆలోచించా. కానీ, ఈ రోజు నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. అవన్ని సహించలేక ఇప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. అతడి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. రవి ఇలా మాట్లాడుతుంటే ఆలా బాధగా ఉంది. అతడు నన్న అమ్మ అని పిలిచేవాడు. తనని ఇంతకాలం హీరో గా చూశాను. కనీ సానుభూతి కోసం అతడు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. తనని హీరో చూడాలని అనుకున్నా. అడు ఎప్పుడూ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా” అని తన ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
View this post on Instagram