Published On:

Suriya- Venky Atluri: ఈసారి సూర్యతో వెంకీ అట్లూరి.. గ్రాండ్‌గా ప్రారంభమైన సూర్య కొత్త సినిమా!

Suriya- Venky Atluri: ఈసారి సూర్యతో వెంకీ అట్లూరి.. గ్రాండ్‌గా ప్రారంభమైన సూర్య కొత్త సినిమా!

Suriya- Venky Atluri Combo Movie Launched with Pooja Ceremony: కోలీవుడ్‌ హీరో సూర్య ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాల చేస్తున్నాడు. ఈ ఏడాది రేట్రోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పటికీ కోలీవుడ్‌ థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శిస్తున్నారు. అప్పుడే సూర్య మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. అయితే ఈ సారి తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో మూవీ చేయబోతున్నాడు.

 

ఇప్పటికే దీనిపై ప్రకటన రాగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో సూర్య, హీరోయిన్‌ మమితా బైజు ముహుర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్‌ కొట్టారు. సితారఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

 

ఈ మధ్య వెంకీ అట్లూరి తరచూ తమిళ హీరోలతోనే చేస్తున్నారు. ధనుస్‌తో సార్‌, దుల్కర్‌ సల్మాన్‌తో లక్కీ భాస్కర్‌ వంటి సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు సూర్యతో చేస్తుండటం విశేషం. కాగా ఈ సినిమా జీవి ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తోంది. కాగా సూర్య 46 (#Suriya46)వ ఈ సినిమా ఇది తెరకెక్కనుంది.