Sobhita Dhulipala: తమిళ్ ప్టార్ డైరెక్టర్ చిత్రంలో హీరోయిన్‌గా శోభిత ధూళిపాళ.. ఏ సినిమాలో అంటే..!

Sobhita Plays female Lead in Pa Ranjith Movie: నాగ చైతన్యతో పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తోంది నటి శోభిత. ఇటీవలే ఈ కొత్త జంట హానీమూన్ వెళ్లొచ్చింది. వీరి పెళ్లై ఐదు నెలలు అవుతోంది. అప్పుడే ఈ జంట నుంచి త్వరలో తీపి కబురు రాబోతుందంటూ ప్రచారం జరిగింది. శోభిత ప్రెగ్నెంట్ అని, దీనిపై అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అది ఉట్టి పుకారేనని, శోభిత ఇప్పట్లో తల్లి అయ్యేందుకు సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ రూమర్స్ చెక్ పడింది. ఇప్పుడు శోభితకు సంబంధించిన మరో ఆసక్తిర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
పెళ్లయిన తర్వాత శోభిత ఇక సినిమాలపై ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ వింటూ నచ్చిన వాటిని ఓకే చెప్పేందుకు చూస్తోంది. కాగా మొన్నటి వరకు పెద్ద పరిచయం లేని శోభిత నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. విశాఖపట్నంకు చెందిన ఆమె తొలుత అందాల పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత పలు వాణిజ్య ప్రకటనలో నటించిన ఆమె రామమ్ రాఘవమ్ 2.0 అనే బాలీవుడ్ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో గుఢాచారి, మేజర్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అదే సమయంలో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్స్‌లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది.
అదే విధంగా హాలీవుడ్ మంకీ మాన్ చిత్రంలో నటించిన పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది. అలా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళి భాషలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లో నటించి పాన్ వరల్డ్ నటిగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తున్న ఆమెకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చింద. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్‌గా ఆమెను పరిశీలిస్తున్నారట. ఈ మేరకు శోభితను సంప్రదించినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
శోభితకు కూడా కథ నచ్చిందని, పా. రంజిత్ వంటి స్టార్ డైరెక్టర్ సినిమా కాబట్టి ఆమె కూడా నటించేందుకు ఆసక్తిగా ఉందట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే తమిళంలో శోభిత హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్‌తో కలిసి నీలం స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోందట. ఇందులో ఆట్టకత్తి దినేష్ హీరోగా ఆర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది.