NTR – YVS Chowdary Movie: నందమూరి ఇంటి నుంచి మరో హీరో ఎంట్రీ.. ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్సవం!

YVS Chowdary and Taraka Ramarao Movie Launch: దివంగత నటుడు నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కొడుకు.. తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తారక రామారావు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. నేడు చిత్రం పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి గారపాటి లోకేశ్వరితో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేవ్వరి హీరోహీరోయిన్లుపై ముహుర్త సన్నివేశానికి క్లాప్ కొట్టారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై వైవీఎస్ చౌదరి భార్య గీత సినిమాని నిర్మించనున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. తెలుగు భాషకు ఇందులో పెద్దపీట వేయనున్నారట. ఈ సినిమాతో హైందవ సంస్క్రతి, తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనున్నట్లు ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి తెలిపారు. నేపథ్యమే సినిమాకు బలమన్నారు. ఇందులో తారక రామారావు సరసన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణరావు హీరోయిన్‌గా నటిస్తోంది.
తారక రామారావుకు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులు శుభకాంక్షలు తెలుపుతున్నారు. నందూమరి తారక రామారావు గొప్ప విజయాలని ఆందులోకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. “తార రామారావు ఇండస్ట్రీలో అడుగు పెడుతోన్న సందర్భంగా ఆయనకు నా హ్రదయ పూర్వక శుభకాంక్షలు. నటుడిగా గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు.
నారా భువనేశ్వరి పోస్ట్ చేస్తూ.. “చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన భాదను అధిగమించడం నుంచి ఈ రోజు హీరోగా ఎంట్రీ ఇవ్వడం వరకూ తారక్ ప్రయాణం మాకెంతో గర్వకారణం. నా మనవడు నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోన్న సందర్భంగా అభిమనందనలు. నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. నారా వారి కోడలు బ్రహ్మణి ట్వీట్ చేస్తూ.. “సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకేళ్లే నటుడిగా.. జానకిరామ్ కుమారుడిగా నీ ప్రయాణం గొప్ప సంకల్పంతో ప్రారంభమవుతోంది. నటనలో ఉన్నత శిఖరాలు అందుకొని కుటుంబంతో పాటు.. తెలుగు సినిమా గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.