Nagarjuna Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన అక్కినేని నాగర్జున.. అఖిల్ పెళ్ళికి ఆహ్వానం!
Nagarjuna Invites AP CM Chandrababu Naidu for Akhil’s Wedding: సినీ హీరో అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం అయ్యారు. ఆయన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందజేసేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా సీఎంతో కాసేపు సమావేశమై.. అనంతరం తన కుమారుడికి పెళ్లికి సకుటుంబ సమేతంగా ఆహ్వానం తెలుపు పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కాగా గతేడాది నవంబర్ 26న జైనబ్ రజ్వీతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీని వీరి విహహం హైదరాబాద్‌లో జరగనుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిఖిల్, జైనబ్‌ల వివాహం జరగనుంది. ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్. జుల్పీ రవ్‌డ్జీకి, నాగర్జున కుటుంబాలు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరు స్నేహితులు, బిజినెస్ పార్ట్‌నర్స్ అని తెలుస్తోంది. కాగా గతంలో నిఖిల్‌కు ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భోపాల్‌తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఇది పెళ్లి వరకు వెళ్లలేదు. జైనబ్ కూడా ఇదివరకు పెళ్లై, విడాకులు కూడా అయినట్టు సమాచారం.