Published On:

Kuberaa First Day Collections: ‘కుబేర’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Kuberaa First Day Collections: ‘కుబేర’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Kuberaa First Day Collections: టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఇద్దరు దిగ్గజ నటులు ఉండడంతో భారీగా అంచనాల మధ్య ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే రూ.30కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు అంచనా వేస్తున్నామని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

 

ఈ సినిమా ఉత్తర అమెరికాలోనూ సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఈ మేవీ 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు అంటూ మేకర్స్ చెప్పారు. ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే.. వరల్డ్ లోనే రిచ్ పర్సన్, వీధుల్లో బతికే ఓ నిరుపేద వ్యక్తికి మధ్య నెలకొన్న సంఘర్షణ ఆధారంగా రూపొందించారు. ఈ మూవీలో దేవాగా ధనుష్ నటించగా.. దీపక్ క్యారెక్టర్ గా నాగార్జున యాక్టింగ్ చేశారు. స్టీట్ బాయ్ గా ధనుష్ యాక్టింగ్ అదరగొట్టాడు. అయితే మొత్తం 3 గంటలు రన్ టైమ్ ఉండడంతో విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి: