Last Updated:

Thandel OTT: ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న తండేల్‌ – ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Thandel OTT: ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న తండేల్‌ – ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Thandel OTT Release Date: నాగ చైతన్య, సాయి పల్లవిలు జంటగా నటించిన తండేల్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేసుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కని ఈ సినిమా గత నెల ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. దేశభక్త, ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. దీంతో ప్రేక్షకులు తండేల్‌ చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టాడు.

బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసి నాగ చైతన్య కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.  చైతన్య కెరీర్‌లో రూ.100 కోట్లు గ్రాస్‌ చేసిన తొలి చిత్రంగా తండేల్‌ నిలిచింది. ఎంతో కాలంగా ఓ భారీ హిట్‌ కోసం నాగచైతన్య తండేల్‌ గట్టి కంబ్యాక్‌ ఇచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఇటూ యూత్‌ని, అటూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించింది.

ఇక థియేటర్లలో ఫుల్‌ జోరు చూపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. సరిగ్గా నెల రోజులకే తండేల్‌ ఓటీటీకి రాబోతోంది. మార్చి 7నుంచి ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు రాబోతోంది. తండేల్‌ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం నెల రోజుల్లో ఈ సినిమా ఓటీటీకి తీసుకురాబోతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. మార్చి 7న తండేల్‌ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

దీంతో ఓటీటీ ప్రియులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని డి మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది గుజరాత్ వెరావల్‌ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన వారు పాకిస్థాన్‌ జలల్లోకి ప్రవేశిస్తారు. దీంతో వారిని పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపిస్తారు. దీంతో వారిని ఇండియాకు తీసుకువరాడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందనేది కథ. అయితే ఈ యదార్థ సంఘటనకు దేశభక్తి, ప్రేమను జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.