Sandeep Reddy Vanga: డైరెక్టర్ అవ్వడం కంటే.. ఐఏఎస్ అవ్వడం పెద్ద కష్టం కాదు – సందీప్ రెడ్డి కౌంటర్

Sandeep Reddy Vanga Counter to Ex IAS Offier: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2023 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లుతో సంచలనం సృష్టిచింది. ఫాదర్ సెంటిమెంట్‌తో వైల్డ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉండటంతో మూవీపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమాపై పలువురు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
సామాజిక విలువలు పాటించాలి
ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్పయకీర్తి యానిమల్ గురించి ప్రస్తావిస్తూ విమర్శ చేశారు. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదన్నారు. ఈ సినిమాల్లో హీరో జంతువుల ప్రవర్తించాడని చూపించారు. ఇలాంటి సినిమాల వల్ల డబ్బు వస్తుండోచ్చు. కానీ, అదే కోణంలో సినిమాని చూస్తే ఎలా? మూవీస్ తెరకెక్కించేటప్పుడు సామాజిక విలువలు పాటిస్తే బాగుంటుందన్నారు. అయితే ఆయన కామెంట్స్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన ఐఏఎస్ అధికారి కామెంట్స్‌పై అసహనం చూపించారు.
ఐఏఎస్ అవ్వడం ఈజీనే..
“ఒక మాజీ ఐఏఎస్ అధికారి యానిమల్ లాంటి సినిమాలు రాకూడదు అన్నారు. ’12th ఫెయిల్ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్ వంటి సినిమాలు తీసి సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నారు’ అని అన్నారు. ఆయన మాటలు విన్నాక నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా అనిపించింది. నన్ను విమర్శించినా సహిస్తాను. కానీ, ఇలా ఎవరైనా నా సినిమాపై దాడి చేస్తే నాకు కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు. ఇందుకోస వారు ఢిల్లీ వెళ్లి ఏదోక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి రెండుమూడేళ్ల కష్టపడి చదివితే కాదు ఐఏఎస్ అయిపోతారు. ఇందుకోసం వారు కొన్ని వందల పుస్తకాలు చదివితే చాలు.
ఐఏఎస్ అయిపోవచ్చు. కానీ, డైరెక్టర్ అవ్వడమంటే అంత ఈజీ కాదు. దర్శకరచయిత కావాలంటే ప్రత్యేకమైన కోర్సులు కూడా ఉండవు. ఏ టీజర్ కూడా మిమ్మల్ని దర్శకుడిగా, రచయితగా తీర్చిదిద్దలేరు. మనకు మనమే అన్నీ నేర్చుకోవాలి. ఇందుకోసం నిత్యం పుస్తకాలు చదువుతూనే ఉండాలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నాజంటగా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్‌లు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.