SC on Thug Life Movie: ‘థగ్ లైఫ్’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు వార్నింగ్
Supreme Court Slams Karnataka Govt Over Thug Life Ban: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న సంఘాలకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. థియేటర్లలో సినిమా ప్రదర్శించే విషయంలో గుంపులకు, ఆరాచక శక్తులను అధికారం లేదని మండిపడింది.
సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని, దానిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. థగ్ లైఫ్ మూవీ నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టును నుంచి తనకే బదిలీ చేసుకుంది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్‌పై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఇవ్వాల్సిందే ఇప్పటికే ఆదేశించింది. అలాగే కమల్ హాసన్ తన వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
కమల్ వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు కర్ణాటక ప్రజలకు ఉందని, ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. కమల్ హాసన్ వ్యాఖ్యలు తప్పు అని కర్ణాటక, బెంగళూరు ప్రజలు నమ్మితే.. దానిపై ఒక ప్రకటన జారీ చేయవచ్చని సూచింది. అంతేకానీ, సినిమా థియేటర్లను తగలబెట్లాలని ఎందుకు బెదిరిస్తున్నారు? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కాగా కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం మే 5న విడుదలైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత వీరద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ మూవీ ఆడియో లాంచ్ కమల్ మాట్లాడుతూ కన్నడ భాషను ఉద్దేశించి మాట్లాడారు. తమిళ్, కన్నడీగులు అంతా ఒక్కటేనని, తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందన్నారు. తామంత ఒక్కటే అనే ఉద్దేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, కమల్ కామెంట్స్‌ని కన్నడీగులు వ్యతిరేకించారు. తమని తమిళులు ఎప్పుడూ అవమానిస్తున్నారని, తమ ఏ సినిమా విడుదలైన.. కన్నడ ప్రజలు, కన్నడ భాష కించపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కానీ, కమల్ మాత్రం తాను క్షమాపణలు చెప్పేదే లేదని స్పష్టం చేశారు.