Last Updated:

The Paradise: నానికి విలన్ గా భక్తవత్సలం నాయుడు.. అమ్మ బాబోయ్ ఇదే కనుక నిజమైతే.. ?

The Paradise: నానికి విలన్ గా భక్తవత్సలం నాయుడు.. అమ్మ బాబోయ్ ఇదే కనుక నిజమైతే.. ?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క హీరోగానే కాకుండా ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి మంచి మంచి విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఏ రేంజ్ లో రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

దసరా లాంటి భారీ హిట్ తరువాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో మొదటినుంచి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ది ప్యారడైజ్ గ్లింప్స్ ఉండడంతో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమాలో  నాని తల్లిగా సోనాలి కులకర్ణి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె కాదు నటి రమ్యకృష్ణ ఆ పాత్రలో కనిపిస్తుందని సోషల్ మీడియాలో టాక్ నడిచింది.

 

ఇక ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెల.. కలక్షన్ కింగ్ మోహన్ బాబును దింపుతున్నాడట. నానికి ధీటైన విలన్ గా మోహన్ బాబు కనిపించనున్నాడని చెప్పుకొస్తున్నారు. కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అని చెప్పొచ్చు.

 

భక్తవత్సలం నాయుడు.. ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసుండొచ్చు.  అదే పేరుతో ఇండస్ట్రీకి వచ్చి.. విలన్ గా భయపెట్టి.. హీరోగా మారి కలక్షన్ కింగ్ గా ప్రఖ్యాతి పొందిన మోహన్ బాబు అసలు పేరే భక్తవత్సలం నాయుడు. కెరీర్ లో మోహన్ బాబు విలన్ గా చేసిన పాత్రలు చూస్తే కచ్చితంగా ఇప్పటి జనరేషన్ భయపడతారు అని చెప్పొచ్చు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు నాని కోసం మరోసారి తన గతంలోకి వెళ్లనున్నాడు. నాని- మోహన్ బాబు మధ్య వార్ సీక్వెన్స్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.