Published On:

HIT 3 OTT Release Date: ఇట్స్ ఆఫీషియల్‌.. హిట్‌ 3 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

HIT 3 OTT Release Date: ఇట్స్ ఆఫీషియల్‌.. హిట్‌ 3 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Hero Nani’s Hit 3 Movie Locks OTT Release Date: నేచురల్‌ స్టార్‌ నాని ఈ మధ్య బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. అదే జోష్‌లో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల హిట్‌ 3తో మరో హిట్‌ కొట్టాడు. హిట్‌ చిత్రాల ఫ్రాంచైజ్‌ నుంచి వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి క్రియేట్‌ అయ్యింది. ఇందులో నాని ఎన్నడు చూడని సరికొత్త లుక్‌లో కనిపించాడు.

 

ఫ్యామిలీ మ్యాన్‌గా సాఫ్ట్‌ రోల్స్‌లో కనిపించిన నాని.. హిట్‌3 అర్జున్‌ సర్కార్‌గా ఫుల్‌ వయోలెన్స్‌తో ఉచకోత చూపించాడు. నాని వయోలెన్స్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేకపోయారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు కాస్తా దూరంగా ఉన్నారు. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టేకపోయినా.. టాక్ పరంగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ముఖ్యంగా యూత్‌ని అర్జున్‌ సర్కార్‌గా ఆకట్టుకున్నాడు. మే 1న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో హింస ఎక్కువైందనే విమర్శలు వచ్చాయి.

 

కానీ యాక్షన్‌ జానర్లు ఇష్టపడే మూవీ లవర్స్‌, యూత్‌కి మాత్రం హిట్‌ 3 మంచి కిక్‌ ఇచ్చింది. ఓ వర్గం ఆడియన్స్‌ ఈ సినిమా బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ అతి తక్కువ టైంలోనే హిట్‌ 3 వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అలాగే ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా అదరగొట్టింది. మిలియన్ల కలెక్షన్లతో యూకే బాక్సాఫీసును షేక్‌ చేసింది. బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన ఈచిత్రం ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమవుతుంది. నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్దమవుతుంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

 

ఒప్పందం ప్రకారం నాలుగు వారాల్లో హిట్‌ 3ని ఓటీటీకి తీసుకువస్తోంది. మే 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీనిపై సదరు సంస్థ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. హిట్‌ 3 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ రావడంతో మూవీ లవర్స్‌ అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను థియేటర్లలో మిస్‌ అయిన వారు ఎంచక్కా ఇంట్లోనే ఈ మూవీ చూసి ఎంజాయ్‌ చేయండి. శైలెష్‌ కొలను దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని స్వయంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. కేజీయఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అడివి శేష్‌, తమిళ హీరో కార్తీలు సాలిడ్‌ క్యామియో ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి: