Jamun Fruit: షుగర్ తో బాధపడుతున్నారా.! నేరేడు పండ్లను ఇలా తీసుకోండి

Jamun Fruit: ప్రకృతి మనిషి జీవితానికి ఆయువు పట్టు. మనిషి బతకడానికి కావలసిన ఆహారాన్ని పుష్టిగా అందిస్తుంది. ఏ కాలంలో ఏ ఆహారం తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో అలాంటి వాటినే పండ్ల రూపంలో ప్రకృతి మనిషికి అందిస్తుంది. మే-జూన్ నెలలో నేరేడు పండ్లు విరివిగా దొరుకుతాయి. వీటిని తినడం వలన షుగర్ వ్యాది గ్రస్తులకు ఎంతో ఉపషమనంతో పాటే వ్యాదిని కంట్రోల్ లో ఉంచుతుంది. వీటితో పాటే అందులోని గింజలు కూడా షుగర్ ను నియంత్రిస్తాయి.
ఎండాకాలం చివర్లో వచ్చేవే నల్ల నేరేడు పండ్లు, తింటే ఒగరుగా ఉంటాయి. చిన్నపిల్లలు తినడంతో పాటు ఆటకు కూడా బాగా ఉపయోగిస్తారు. ఎందుకంటే నల్లనేరేడు పండును తింటే నోరు మొత్తం మెజేండా కలర్ లో మారుతుంది. ముఖ్యంగా నాలుక. ఇవి షుగర్ వ్యాదితో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగం. పండు ఎంత ఉపయోగమో అందులోని గింజలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాకపోతే గింజలను ఎండబెట్టి వాడుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం.

jamun fruit useful to sugar patients seeds
నల్లనేరేడు పండ్ల గింజల్లో ఎక్కువగా విటమిన్ సి, ఎ తోపాటు ఫైబర్ అధికంగా ఉంది. వీటికి జాంబోసైట్, జాంబోలిన్ అనే గుణాలు ఉన్నాయి. ఇవి షుగర్ ను రెగ్యులేట్ చేస్తాయి. ఇది షుగర్ కు మెడిసిన్ లా పనిచేస్తుంది.
నేరేడు పండ్లను తిన్నతర్వాత గింజలను వేరుచేసి కడిగి ముందుగా ఆరబెట్టాలి. ఆతర్వాత గ్రైండ్ చేసి మెత్తని పొడిలా మార్చుకోవాలి. దానిని పాలలో, గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. షుగర్ కంట్రోల్ ను చేస్తుంది. వీటిని తీసుకోవడం వలన రక్తసరఫరా పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, మిటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇవి పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నయం చేస్తుంది.

jamun fruit and seeds
ఎప్పుడు తినాలి…
నేరేడు గింజల పొడిని ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. పరకడపున మాత్రం తీసుకోవద్దు. ఇలా చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి.
గమనిక.. పైవిషయాన్ని అవగాహనకోసం మాత్రమే. ఇవి ఏవిధంగానూ రోగానికి మందులు కావు. మామూలు మెడిసిన్ తీసుకుంటూ ఆయుర్వేద, అల్లోపతి డాక్టర్లను సంప్రదించిన తర్వాత మాత్రమే వాడగలరు. ఖచ్చితత్వానికి చానల్ కు సంబంధంలేదు.