Manchu Vishnu: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ – ఎవరు తీశారో చెప్పిన మంచు విష్ణు

Manchu Vishnu Reaction on Kannappa Hard Drive Missing: కన్నప్ప హార్డ్‌డ్రైవ్ మిస్సింగ్‌పై మంచు మనోజ్ స్వయంగా స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్సలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వారు ఈ హార్డ్ డిస్క్ తీశారని విష్ణు ఆరోపించాడు. అయితే అవి వాళ్లకు వాళ్లుగా తీశారా? లేక ఎవరైనా చెబితే తీశారా? అనేది క్లారిటీ లేదని పేర్కొన్నాడు.
“ఏ సినిమాకైనా ప్రతి ఒక్కరూ సేఫ్టి డ్రైవ్‌ను పెట్టుకుంటారు. ఇది సాధారణంగా జరిగేదే. కన్నప్ప సీజీ పనులను భారత్‌లో మొత్తం ఎనిమిది కంపెనీలు చేస్తున్నాయి. విదేశాల్లో రెండు కంపెనీలు ఆ పనిలో ఉన్నాయి. చెన్నై,ముంబై, హైదరాబాద్‌లో ఇలా వేర్వేరు చోట్ల ఈ పనులు జరుగుతున్నాయి. కన్నప్పలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ పూర్తి చేసిన డేటా ఆ మిస్సయిన హార్డ్ డిస్క్‌లో ఉంది. సినిమా డిజిటల్ వెర్షన్‌కు సంబంధించి హాలీవుడ్‌లో మూడు కాపీలు, హైదరాబాద్‌లో రెండు కాపీలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు.
అనంతరం “హార్డ్ డిస్క్ బయటకు వెళ్లిన విషయం పోలీసుల ద్వారా రిపోర్టర్లకు తెలిసింది. దీంతో ఇది బయటకు వచ్చింది. అంతేకానీ తాను ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అది నాకు ఇష్టం లేదు కూడా. కలర్ గ్రేడింగ్‌కు సంబంధించి ముంబైలో వర్క్ జరిగితే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదటిసారి పంపినప్పుడు అది సరిగా రాలేదు. దీంతో ఆ కంపెఈన హార్డ్ డ్రైవ్‌లో ఆ సీన్స్ పెట్టి కొరియర్ చేసింది. కానీ, అది ప్రొడక్షన్ హౌజ్‌కి గానీ, ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసే కంపెనీకి గానీ రాలేదు.
సాధారణంగా మేము రెండు అడ్రస్ పెట్టాం. ఒకటి ఆఫీస్ అడ్రస్‌గా, మరోకటి జీఎస్టీ రిజిస్ట్రార్ అడ్రస్ ఉంది. ఇది ఫిల్మ్ నగర్‌లోని నాన్నగారి ఇంటి అడ్రస్. ఆయన ముగ్గురు పిల్లలకు సంబంధించి ఎలాంటి కొరియర్ అయినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరికి వాళ్లకు అందజేస్తారు. ఇటీవల పరిస్థితులు సరిగా లేకపోవడంతో దానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ చేశారు. ఆ సమయంలో రఘు అనే అతను కఅ్కడికి వచ్చాడు. ఆ ప్యాకేట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. వాళ్లిద్దరు మా సోదరుడు ఇంట్లో పని చేస్తారు. ప్రస్తుతం వారు అక్కడ చేస్తున్నారా? లేదో తెలియదు. అక్కడే ఉంటారని అనుకుంటున్నా. మరి ఇది అతను చెబితే చేశారా? లేక వాళ్లే చేశారా? అనేది తెలియదు” అని ఆరోపించాడు.