Last Updated:

War 2: వార్ 2.. రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్

War 2: వార్ 2.. రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్

War 2: ఆర్ఆర్ఆర్ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాగా వేయడానికి  ఆలోచనలు చేస్తుండే వాడు. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చిన గుర్తింపుతో తారక్.. ఎట్టకేలకు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మొదటి సినిమానే  యష్ రాజ్ స్పై యూనివర్స్ లో చేస్తున్నాడు.

 

బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం వార్ 2. బ్రహ్మాస్త్ర సినిమాకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 రాబోతుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీకైన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతుంది. అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ఇస్తారా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఎట్టకేలకు ఈరోజు వార్ 2 రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ప్రపంచవ్యాప్తంగా వార్ 2 .. ఆగస్టు 15 న రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు.

 

తెలుగు అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.  యష్ రాజ్ స్పై యూనివర్స్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా వార్  తెలుగువారిని కూడా అలరించింది. అందులో టైగర్ ష్రాఫ్, హృతిక్ యాక్షన్, డ్యాన్స్  కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక వార్ 2 లో అవన్నీ రెట్టింపు ఉండనున్నాయని సమాచారం.

 

వార్ 2 లో హృతిక్, ఎన్టీఆర్ కు ఒక డ్యాన్స్ సీక్వెన్స్ కూడా ఉంది. ఈ మధ్యనే ఈ సాంగ్ షూట్ కోసం ఎన్టీఆర్ ముంబైకి వెళ్ళాడు. అయితే ఆ షూటింగ్ లోనే హృతిక్ కాలికి గాయం అవ్వడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చారు. ఇక అంతలోనే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి మరణించిన విషయం తెల్సిందే. దీంతో కొన్నిరోజులు షూటింగ్ ఆగిందని సమాచారం.  త్వరలోనే ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.