Published On:

Manchu Manoj Emotional: మా నాన్నంటే కోపం లేదు – నా కూతురిని ఆయన ఎత్తుకుంటే చూడాలని ఉంది: మంచు మనోజ్‌

Manchu Manoj Emotional: మా నాన్నంటే కోపం లేదు – నా కూతురిని ఆయన ఎత్తుకుంటే చూడాలని ఉంది: మంచు మనోజ్‌

Manchu Manoj Emotional on Manchu Family Issues: మంచు మనోజ్‌ ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. మే 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన కుటుంబంలో నెలకొన్న పరిణామాలను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన కూతురిని తన తండ్రి (నటుడు మోహన్‌ బాబు) ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

 

తన తండ్రిపై కోపం లేదని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. “ప్రస్తుతం పరిస్థితుల వల్ల అమ్మను చాలా మిస్‌ అవుతున్నా. తనని కలవడానికి కండిషన్స్‌ పెట్టారు. మా అమ్మను చూడడానికి పర్మిషన్‌ తీసుకోవాలట. లేదంటే నేను వెళ్తే మా అమ్మకు బయటకు వచ్చి కలవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అమ్మ కూడా మమ్మల్ని ఎంతో మిస్‌ అవుతుంది. అమ్మ అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటుంది. మా పాప అంటే అమ్మకు ఎంతో ఇష్టం. మా మధ్యలో ఆమె ఎంతో నలిగిపోతున్నారు. ఈ గొడవల వల్ల అక్కను దూరంగా పెట్టాను. రీసెంట్‌గా తన ఆధ్వర్యంలో జరిగిన టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఈవెంట్‌కు నేను వస్తానో, రానో కూడా తనకు తెలియదు.

 

నేను ఆ ఈవెంట్‌కి వెళ్లాలి అని కూడా అనుకోలేదు. కానీ అక్క కోసం వెళ్లాను. అక్కడ నన్ను సెడన్‌గా చూసి ఆమె ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. ఇంతకాలం నేను ఏమైపోతానో అని తను ఎంతో భయపడింది. కానీ దేవుడి దయవల్ల, నా కుటుంబం(భార్య పిల్లల), అభిమానులు ఇచ్చిన ధైర్యంతో నిలబడ్డాను” అని ఆమె చెప్పుకొచ్చారు. “తొమ్మిదేళ్లు ఒంటరిగా ఉన్నాను. పెళ్లయిన తర్వాత కూడా ఎంతో ఆత్మగౌరవంతో బతికాను. నా భార్య(మౌనిక) ప్రెగ్నెంట్‌ సమయంలో మళ్లీ మేమంత కలిశాం. అది మా ఫ్యామిలీలో ఒక్కరికి నచ్చలేదు. మరోవైపు కాలేజీలో సమస్యల గురించి పెద్దాయన వరకు వెళ్లనీవ్వడం లేదని కొందరు స్టూడెంట్స్‌ నాకు లేటర్స్‌ రాశారు.

 

ఆ టైంలో నేను ప్రశ్నిస్తే నీకేంటి సంబంధం? అన్నారు. కాలేజీ పనిచేసేవారందరితో నాపై నా భార్యపై కేసు పెట్టించారు. ఎంతో ట్రై చేశాను.. నా వల్ల కాకపోవడంతో మీడియాను ఆశ్రయించాను” అని ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. నేను ఏ తప్పు చేయలేదు.. చేయని తప్పును అంగీకరించమంటే ఎలా? నా పిల్లలకు నేనేం నేర్పుతాను. మా నాన్న అంటే నాకు ఇష్టం. ఆయన కాళ్లు పడ్డుకోవాలని, ఆయననున ప్రేమ, అప్యాయంగా కౌగిలించుకోవాలని ఉంది. మా నాన్న నా కూతురి ఎత్తుకుని తన ఒడిలో పెట్టుకుంటే చూడాలని ఉంది” అంటూ మనోజ్‌ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

 

ఇవి కూడా చదవండి: