Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. ఈ మూవీతో కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న గతంలో ఫ్లాప్ లతో ఢీలా పడ్డ మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తూ ఈసారి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు మేకర్స్. కాగా ఇప్పటికే టీజర్ మి కి మంచి రెస్పాన్స్ రాగా.. మరోవైపు మూడు సాంగ్స్ ని విడుదల చేయగా మంచి హిట్స్ గా నిలిచాయి. కాగా ఇప్పుడు తాజాగా మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ ని మూవీ యూనిట్ ప్రకటించింది.
ఈ నెల 27న `భోళాశంకర్` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు (Bhola Shankar) టీమ్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అయితే నిన్న శనివారం పవన్ కళ్యాణ్ నటించిన `బ్రో` ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో `బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఆ వెంటనే మరో రెండు రోజుల్లో `భోళాశంకర్` ట్రైలర్ రానుండడంతో బ్యాక్ టూ బ్యాక్ మెగా బ్రదర్స్ రచ్చ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక 28 వ తేదన పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన “బ్రో” రిలీజ్ కానుంది. దీంతో మెగా మానియాని ఫ్యాన్స్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
Get ready for the
MEGA ENTERTAINING ACTION spectacleMega
@Kchirutweets‘ #BholaaShankar TRAILER ON JULY 27th
Stay Tuned
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati @dudlyraj @BholaaShankar @adityamusic… pic.twitter.com/qQLqvYYJ0d
— AK Entertainments (@AKentsOfficial) July 23, 2023