Published On:

Lavanya Tripathi Emotional: తీవ్ర దు:ఖంలో మెగా కోడలు లావణ్య.. మిస్‌ యూ మై బేబీ గర్ల్‌ అంటూ ఎమోషనల్‌

Lavanya Tripathi Emotional: తీవ్ర దు:ఖంలో మెగా కోడలు లావణ్య.. మిస్‌ యూ మై బేబీ గర్ల్‌ అంటూ ఎమోషనల్‌

Lavanya Tripathi Pet Dog Passed Away: మెగా కోడలు, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి తీవ్ర దు:ఖంలో ఉంది. మిస్‌ యూ మై స్వీటీ.. నేను కలిసిన బేబీ గర్ల్‌లో అత్యంత మంచిదానివే నువ్వే అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ అయ్యింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతక అసలేం జరిగింది అంటే.. లావణ్య త్రిపాఠి పెంపుడు శునకం మరణించింది.

 

ఈ సందర్భంగా దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యింది. దానితో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తన పెంపుడు శునకానికతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. “నీకంటే స్వీటెస్ట్‌ బేబీ గర్ల్‌ (పెంపుడు కుక్కను) నేను ఇంతవరకు కలవలేదు. నేను చూసి శునకాల్లో నువ్వే అత్యంత మంచిదానివి. ఒకవేళ నీకే అంత శక్తి ఉంటే నా కోసం టీ కూడా పెట్టేదానివని ఎప్పుడూ నా చూట్టూ ఉండేవాళ్లకు నీ గురించే చెబుతూ ఉండేదాన్ని. నీది ఎంతో మంచి మనసు. నువ్వు చాలా దయగల దానివి. అలాగే ఎంతో తెలివైన దానివి మై స్వీటీ. నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మిస్‌ మై బేబీ గర్ల్‌” అంటూ లావణ్య తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

 

ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ప్రస్తుతం లావణ్య త్రిపాఠి గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించింది. కాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో 2023 నవంబర్‌ 1న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ మెగా జంట గుడ్‌న్యూస్‌ చెప్పడంతో అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో సతీ లీలావతి అనే సినిమా చేస్తోంది.