Lokesh Kanagaraj – Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరోతో లోకేష్ కనగరాజ్ మూవీ.. కన్‌ఫాం చేసిన ఆమిర్ ఖాన్
Aamir Khan Confirms Superhero Movie With Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోని ఆయన డైరెక్టర్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఆమిర్ ఖాన్. ఆమిర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ కాంబో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్టు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను కన్‌ఫాం చేశాడు ఆమిర్. ఆయన నటించి ‘సితారే జమీన్ పర్’ మూవీ త్వరలో విడుదల కానుంది.
ఈ క్రమంలో ఆమిర్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్‌తో తాను ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమాను ప్రారంభిస్తున్నట్టు చెప్పాడే. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇది సూపర్ హీరో జానర్ స్టోరీ ఉంటుందని చెప్పాడు. రెండేళ్ల పాటు ఈ సినిమా గురించి చర్చించుకున్నామని ఆమిర్ చెప్పుకొచ్చాడు.
కాగా ఖైది, విక్రమ్, లియో చిత్రాలతో తమిళంలో స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. దీంతో లోకేష్ కనగరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ మార్కెట్ పెరిగింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత ఆయన ఆమిర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరోవైపు ఆయన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సైతం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. రాజ్ కుమార్ హిరాణీ ఈ సినిమా దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఆయనతో ఆమిర్ ఈ బయోపిక్ సంబంధించి చర్చలు జరుపుతున్నారు. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై సినిమా చేయనన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆయన నిర్మాతగా వ్వవహరించనున్నారు. ఇక ‘పీకే 2’ మూవీపై వస్తున్న రూమర్స్‌పై కూడా స్పందించారు. పీకే 2 చేసే ఆలోచన లేదని, ఈ సినిమా ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
- HC Warns to Hero Vishal: ముప్పై శాతం వడ్డీతో సహా రూ. 21 కోట్లు చెల్లించాల్సిందే.. హీరో విశాల్‌కు హైకోర్టు షాక్!