Last Updated:

Bhagavanth Kesari : బాలయ్య “భగవంత్ కేసరి” నుంచి “గణేష్ ఆంధమ్” రిలీజ్..

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Bhagavanth Kesari : బాలయ్య “భగవంత్ కేసరి” నుంచి “గణేష్ ఆంధమ్” రిలీజ్..

Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. విజయ దశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

బాల‌య్య గ‌త చిత్రాలు అఖండ‌, వీర సింహ‌రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల‌ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీ పై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి బాలయ్య హ్యాట్రిక్ హిట్టుని ఇస్తాడా..? లేదా..? చూడాలి. కాగా తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈక్రమంలోనే సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండడం మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

 

 

“గణేష్ ఆంధమ్” అనే ఈ పాట ఈ ఏడాది గణేష్ ఉత్సవాల్లో మారుమోగనుంది. కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ అందించగా కరీముల్లా, మనీష్ పండ్రంకి పాడారు. శేఖర్ మాస్టర్ గ్రాండ్ విజువల్స్ తో డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ పాటకు బాలయ్య, శ్రీలీల స్టెప్పులు వేయడం అభిమానులకు పూనకాలు వచ్చేలా ఉన్నాయి.