Last Updated:

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. ఏ మూవీ అప్డేట్ ? ఎప్పుడంటే ??

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఉన్న ఫ్యాన్  ఫాలోయింగ్ గురించి అందరికీ  తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. ఏ మూవీ అప్డేట్ ? ఎప్పుడంటే ??

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఉన్న ఫ్యాన్  ఫాలోయింగ్ గురించి అందరికీ  తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఏ సినిమా అప్డేట్ ఎప్పుడు రానుందో మీకోసం ప్రత్యేకంగా..

ముందుగా సుజీత్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ, తమిళ్ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు, మరి కొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫిరత లుక్ కూడా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా టీజర్ తో ఫైర్ స్టోమ్ ఈజ్ కమింగ్ అంటూ హైప్ పెంచేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా కనిపించనుంది. అశుతోష్‌ రాణా, నవాబ్‌ షా, కేజీయఫ్‌ నటుడు అవినాష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు.

ఇప్పటికే గ్లింప్స్‌తో సోషల్‌మీడియాలో సందడి చేసిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘అప్‌డేట్‌ దారిలో ఉంది’ అని హరీశ్‌ శంకర్ ట్వీట్‌ చేశారు. దీంతో ‘టీజర్‌ ప్లాన్ చేశారా’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడతున్నారు. సుమారు 11 ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్‌ శంకర్‌ల కాంబోలో రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Image

ఇక పవన్‌ సినిమా ‘హరిహర వీరమల్లు’ నుంచి ఎలాంటి సమాచారం లేక నెలలు దాటిపోయింది. కానీ ఇప్పుడు పవన్ పుట్టినరోజున అర్ధరాత్రి 12.17కు కొత్త పోస్టర్‌ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ మూవీ టీమ్‌ ట్వీట్‌ చేసింది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా చేస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.

అలాగే గతంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ సురేంద్ర రెడ్డితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మళ్ళీ ఆ మూవీ నుంచి ఏ అప్డేట్ లేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా ఈ మూవీ కోసం ఒక ఆఫీస్ ని కూడా ఓపెన్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ కి వెళ్ళడానికి మాత్రం కొద్దిగా టైమ్ పడుతుందని సమాచారం.

Image