Last Updated:

Director Sujith : జై పవర్ స్టార్ అంటూ ఎర్ర కండువా కట్టుకుని నినాదాలు చేస్తున్న ఈ కుర్రాడెవరో తెలుసా?

సినిమా పరిశ్రమలోని ఎంతో మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ తెర‌పై త‌మ అభిమాన తార‌లను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతుంటారు.కానీ కొంత మందికి మాత్ర‌మే త‌మ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కుతుంది.

Director Sujith : జై పవర్ స్టార్ అంటూ ఎర్ర కండువా కట్టుకుని నినాదాలు చేస్తున్న ఈ కుర్రాడెవరో తెలుసా?

Director Sujith : సినిమా పరిశ్రమలోని ఎంతో మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ తెర‌పై త‌మ అభిమాన తార‌లను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతుంటారు.

కానీ కొంత మందికి మాత్ర‌మే త‌మ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కుతుంది.

అలాంటి అరుదైన అవ‌కాశం మళ్ళీ ఇప్పుడు యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్‌ దక్కించుకున్నాడు.

ర‌న్ రాజా రన్‌తో సూప‌ర్ హిట్ కొట్టిన సుజిత్.. ఆ తర్వాత ప్ర‌భాస్‌తో ఏకంగా పాన్ ఇండియా మూవీని తీశాడు. సాహో చిత్రం తెలుగులో అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయినా బాలీవుడ్‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఇప్పుడు తన మూడో చిత్రంగా త‌న అభిమాన హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు సుజిత్‌.

 

పవన్ కళ్యాణ్ తో OG చేస్తున్న సుజిత్..

 

సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సుజిత్ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్‌. ఎంతలా అంటే ఆయ‌న సినిమాల‌ను తొలి రోజునే నేల టిక్కెట్టుపై చూసి విజిల్ వేసి, అరుస్తూ గోల చేసేంత‌.

ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌రో హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ బ‌య‌ట పెట్టడంతో వెలుగులోకి వచ్చింది.

అది కూడా వీడియో ద్వారా ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ రిలీజ్ స‌మ‌యంలో సుజిత్ జై ప‌వ‌ర్‌స్టార్ అని అరుస్తూ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అయ్యింది.

ఆ వీడియోను హ‌రీష్ శంక‌ర్ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో షేర్ చేశారు.

ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ‘‘హే సుజిత్ ఇలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ మాకు ఇచ్చినందుకు థాంక్స్‌. అదే ఎగ్జ‌యిట్‌మెంట్‌ను నీ నెక్ట్ రాబోతున్న మా వ‌న్ అండ్ ఓన్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారి సినిమాలో చూపిస్తావ‌ని భావిస్తున్నాం. ఆల్ ది బెస్ట్‌’’ అంటూ వీడియోతో పాటు మెసేజ్ కూడా షేర్ చేశారు హ‌రీష్ శంక‌ర్‌.

 

 

ఈ మధ్యకాలంలో కల్ట్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టింది.

కమల్ హాసన్ విక్రమ్, చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి.. ఈ సినిమాల డైరెక్టర్లు అందరూ ఆ హీరోలకు వీరాభిమానులు.

ట్విటర్‌లో ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతోంది.

తమ అభిమాన హీరోకి మళ్లీ మునుపటి వైభవం తీసుకురావడానికి అభిమానులే దర్శకులుగా వస్తారని ట్రెండ్ చేస్తున్నారు.

ఓజీ పోస్టర్‌లో పవన్‌ కళ్యాణ్ షాడో కనిపిస్తుంది. ఆ షాడో ఒక గన్‌లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఆ ఫొటోపై జపానీస్‌ భాష రాసి ఉంది.

పోస్టర్‌లో జపానీస్ భాషలో రాసి ఉన్న ఆ అక్షరాల అర్థం అగ్నితుఫాన్‌ అని.

పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) నీడలో గన్‌ కనిపిస్తుంది. పవన్‌ ముందు ఉన్న వృత్తాకారం, ఎరుపు రంగు జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.

అలాగే పోస్టర్‌లో ఒక వైపు విగ్రహం ఆకారం కనిపిస్తోంది. అది జపాన్‌ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

ఇకపోతే పోస్టర్‌లో మరోవైపు ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.

దీనిని బట్టి ఈ సినిమా కథ జపాన్‌, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/