Home / Director Sujith
దర్శకుడు సుజిత్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారు. సుజిత్ పవన్‌కి పెద్ద అభిమాని. పవన్ తో పనిచేయాలన్ని తన కలను నెరవేర్చుకునే సమయం అతనికి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని మరియు పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరి కాంబోలో చిత్రం వస్తుందని గత కొద్దికాలంగా ఊహాగానాలు వెలువుడుతున్నాయి. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ థెరికి రీమేక్ అని కూడ టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రణాళికలు మారాయి.