Published On:

Chhaava Box Office Collection Day 66: ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌ ‘ఛావా’.. లాంగ్‌ రన్‌లోనూ కలెక్షన్ల ఊచకోత, మొత్తం నెట్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Chhaava Box Office Collection Day 66: ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌ ‘ఛావా’.. లాంగ్‌ రన్‌లోనూ కలెక్షన్ల ఊచకోత, మొత్తం నెట్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Chhaava Entered Rs 600 Core Club: బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ లేటస్ట్‌ మూవీ ఛావా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లోనే అత్యధిక నెట్‌ వసూళ్లు సాధించిన మూవీ జాబితాలో చేరింది. టాలంటెడ్‌ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా హిస్టారిక్‌ మూవీగా ఈ సినిమాను రూపొందింది. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది.

 

బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్స ఊచకోత చూపించింది. రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటు రికార్డు క్రియేట్‌ చేసింది. చరిత్రలో లేని శంభాజీ మహారాజ్‌ కథను తెలుసుకునేందుకు ఆడియన్స్‌ ఆసక్తి చూపించారు. దీంతో ప్రేక్షకులంతా థియేటర్లకు క్యూ కట్టారు. హిందీలో ఈ మూవీ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమా ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేయాలని డిమాండ్స్‌ వచ్చాయి. దీంతో మార్చి 11న ఛావా మూవీ తెలుగులోనూ రిలీజైంది. ఇక్కడ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ రాణిస్తుంది.

 

అయినప్పటి థియేటర్లలో ఛావా ఇప్పటికీ మంచి రెస్పాన్స్‌ అందుకుంటుంది. ఇప్పటికీ పలు థియేటరల్లో ఛావాను ప్రదర్శిస్తుండటం విశేషం. దీంతో లాంగ్‌ థియేట్రికల్‌ రన్‌లో ఈ సినిమా సరికొత్త రికార్టును తన ఖాతాలో వేసుకుంది. దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసిన సినిమా తాజాగా అత్యధిక నెట్‌ వసూళ్లు చేసిన మూడో చిత్రంగా రికార్డు బ్రేక్‌ చేసింది. ఇప్పటివరకు ఛావా మూవీ హిందీలో రూ. 600 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ని క్రాస్‌ చేసినట్టు తాజాగా మూవీ టీం వెల్లడించింది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో నెట్‌ సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉన్నాయి.

 

ఇప్పుడు ఈ జాబితాలో ఛావా చేరడమే కాదు, మొదటి మూడో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కాగా ఇప్పటికి బాలీవుడ్‌లో అత్యధిక నెట్‌ వసూళ్లు సాధించిన చిత్రాలుగా ‘పుష్ప 2’, ‘స్త్రీ 2’ సినిమాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ఛావా నిలిచింది. ఇక తెలుగులో ఈ సినిమా రూ. 13 కోట్ల నెట్‌ సాధించినట్టు సమాచారం. ఓటీటీలోనూ ఛావా మూవీ అదరగొడుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అత్యధిక వ్యూస్‌ సాధించిన ఐదో చిత్రం ఛావా నిలిచింది. అక్షయ్‌ ఖన్నా, ఆశుతోషం రానా, దివ్య దత్తా వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.