Brahma Anandam OTT Release: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బ్రహ్మా ఆనందం’ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Brahma Anandam Movie OTT Release Date Announced: హాస్య బ్రహ్మనందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులై వారిద్దరు ఈ చిత్రంలో తాత మనవడిగా కనిపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెన్త్ చేసిన సినిమా ఇది. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కుటుంబ కథా చిత్రం కావడంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించింది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో మూవీ మిక్స్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కామెడీ బాగున్నా, కథ, కథనం ఆసక్తిని ఇవ్వలేకపోయింది. డివైడ్ టాక్‌కే సొంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు తాజాగా ‘బ్రహ్మా ఆనందం’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మార్చి 14 నుంచి అంటే రేపటి నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించారు. సావిత్రి, ఉమెష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ ఈ సినిమాను నిర్మించారు.
కథ విషయానికి వస్తే..
బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఓ పెద్ద నటుడు కావాలనేది అతడి కల. చిన్నప్పుడే తల్లిదండ్రులను కొల్పోయిన అతడిని వాళ్ల బాబాయ్ పెంచుతాడు. నటుడు కావాలనే తన ఆశ వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తుంటాడు. సినిమా ప్రయత్నాల్లో ఉండగా.. అతడికి ఢిల్లీలో జరిగే ఓ నాటకంలో అతడికి అవకాశం వస్తుంది. అయితే అందులో పాల్గొనాలంటే రూ. 6 లక్షలు ఇవ్వాలని ఆ నాటకం నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. అదే సమయంలో వృద్ధాశ్రమంలో ఉన్న అతడి తాత ఆనంద రామ్ముర్తి బ్రహ్మను కలుస్తాడు. తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని, అది తన పేరు మీద రాయాలంటే ఓ కండిషన్ పెడతాడు. దానికి ఒప్పుకున్న బ్రహ్మ.. తన తాత, స్నేహితుడు వెన్నెల కిషోర్తో కలిసి వాళ్ల ఊరికి వెళతాడు. మరి అక్కడ బ్రహ్మ ఏం చేశాడు? అతడికి తాత భూమి అందిందా? లేదా? అనేదే ఈ కథ.