Genelia Escaped from Accident: జెనీలియాకు త్రుటి తప్పిన ప్రమాదం.. కారు డ్రైవర్‌పై ఫ్యాన్స్ ఫైర్.. వీడియో వైరల్

Genelia Narrowly Escaped from Accident While Getting Into Car: జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. హా.. హా హాసిని అంటే అంటూ కుర్రకారు గుండెలను కొల్లగోట్టింది. బొమ్మరిల్లు మూవీలో ఆమె చేసి హాసిని పాత్ర ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పింది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న జెన్నీ.. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
సుధీర్ఘ విరామం తర్వాత ఆమె ఆమిర్ ఖాన్ సీతార జమీన్ పర్ మూవీలో కీలక పాత్ర పోషించింది. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి ముందు ట్రయల్ పీరియడ్ అనే కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంతో ఫ్యాన్స్‌ని పలకరించింది. ఇక కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి తనయుడు హీరోగా వెండితెర ఎంట్రీ ఇస్తున్న జూనియర్ సినిమాలోనూ జెనీలియా కీలక పాత్రలో నటించింది. త్వరలోనే ఈ చిత్రం కూడా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే జెనీలియకు జరిగిన ఓ ప్రమాదం గురించి తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆమె ఓ పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా జెనీలియా ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. భర్త, పిల్లలకే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తారనే విషయం తెలిసింది. తరచూ భర్త, పిల్లల కలిసి వెకేషన్‌కి వెళ్లడం, వీకెండ్స్ బయటకు వెళ్లడం అలా చేస్తోంది. ఈ క్రమంలో నిన్న తన ఇద్దరు పిల్లలతో కలిసి జెనీలియా బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లుతుండగా.. కారు ఎక్కే క్రమంలో ఆమె ప్రమాదం ఎదురైంది. తన ఇద్దరు పిల్లలని మొదట కారు ఎక్కించింది. ఆ తర్వాత మీడియాని పలకరిస్తూ జెన్నీ కూడా కారు ఎక్కబోయింది.
అదే సమయంలో డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. దీంతో బ్యాలెన్స్ చేసుకున్న ఆమె అప్రమత్తమైంది. వెంటనే కాలు బయట పెట్టి జాగ్రత్త పడింది. అది గమనించిన డ్రైవర్ వెంటనే కారు బ్రేక్ వేశాడు. దీంతో ఆమెకు త్రుటి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇది చూసి అంతా డ్రైవర్‌పై అసహనం చూపిస్తున్నారు. చూసుకోవాలి కదా.. అంత నిర్ణక్ష్యం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇక జెన్నీలియా ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది, జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చూడటానికి చిన్న ప్రమాదమే అన్నట్టు కనిపించిన.. ఒకవేళ అదే కారు స్పీడ్‌లో వెళ్లుంటే మాత్రం జెన్నీలియా మాత్రం పెద్ద ప్రమాదం భారీన పడేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Salman’s Sikandar OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న సల్మాన్ ఖాన్, రష్మిక మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?