Published On:

Khaleja Re-Release Trailer: మరోసారి థియేటర్లోకి మహేష్‌ ఖలేజా.. రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

Khaleja Re-Release Trailer: మరోసారి థియేటర్లోకి మహేష్‌ ఖలేజా.. రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

Mahesh Babu’s Khaleja Re release Trailer Out Now: గత నెల రోజులు సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి మేకర్స్‌ ట్రీట్‌ ఫిస్ట్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీతమ్మ వాకింట్లో సిరిమల్లే చెట్టు, భరత్‌ అనే నేను, బ్రహ్మోత్సవం, ఒక్కడు, ఖలేజా సినిమాలు వరుసగా రీరిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులు మహేష్‌ కల్ట్‌ క్లాసికల్‌ హిట్స్‌ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఖలేజా టైం వచ్చింది.

 

ఈ సినిమాను త్వరలో రీరిలీజ్‌కు సిద్ధమౌతుంది. ఈ మేరకు మేకర్స్‌ ఖలేజా రీరిలీజ్‌ ట్రైలర్‌ని (Khaleja Rereleas Trailer)విడుదల చేశారు. మే 30న ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్‌ కానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు, అనుష్క శెట్టిలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. చెప్పాలంటే మహేష్‌ బాబు కెరీర్‌లోనే డిజాస్టర్‌ చిత్రమిది. కానీ, దీనికి ఆడియన్స్‌ నుంచి మాత్రం మంచి ఆదరణ వచ్చింది.

 

ఇప్పటికీ టెలివిజన్‌లో ఈ సినిమా వస్తే మాత్రం టీవీలకే అతుక్కుపోతారు. మహేష్‌ కామెడీ టైమింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలగలిపి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు త్రివిక్రమ్‌. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌. అయినప్పటికీ మహేష్‌ ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ మూవీ విష్‌లిస్ట్‌ ఖలేజా మాత్రం తప్పుకుండ ఉంటుందనడంలో ఎలాంటి లేదు. మేకర్స్‌కి భారీ నస్టాలను తెచ్చిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్‌ని అలరించేందుకు రెడీ అవుతుంది.

 

4k వెర్షన్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 30 రీ రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా ‘ఖలేజా’లో మహేష్ బాబు సరసన స్వీటీ అనుష్క హీరోయిన్‌గా నటించగా.. ప్రకాష్ రాజ్ విలన్ రోల్‌లో నటించి మెప్పించారు. రావు రమేష్, షఫీ, సునీల్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు, అర్చనలు మరో కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచిన.. యూట్యూబ్‌, టీవీల్లో అదరగోట్టిన ఈ సినిమా రీ రిలీజ్‌లో థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.