Published On:

Avatar 2 Re-release: మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోన్న అవతార్‌ 2 ది వే ఆఫ్‌ వాటర్‌

Avatar 2 Re-release: మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోన్న అవతార్‌ 2 ది వే ఆఫ్‌ వాటర్‌

Avatar 2 The Way Water Re-releasing in October: వరల్డ్‌ వైడ్‌గా అవతార్‌ సీక్వెల్స్‌ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. హాలీవుడ్‌ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్స్‌కి మూవీ లవర్స్‌ అంతా ఫిదా అయ్యారు. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమాలు బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచాయి. గతేడాది అవతార్‌ చిత్రానికి సీక్వెల్‌ అవతార్‌ 2 వచ్చిన సంగతి తెలిసిందే.

 

అవతార్‌ 2: ది వే ఆఫ్‌ వాటర్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు సాధించింది. 2023 డిసెంబర్‌ 16న థియేటర్లోకి రిలీజైన ఈచిత్రం ఓటీటీలోనూ అదరగొట్టింది. అయితే ఈ విజువల్‌ వండర్‌ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుందట. ఈ చిత్రం రీరిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మేరకు దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. ఒక్క వారం మాత్రమే లిమిటెడ్‌ ఎంగేజ్మెంట్‌తో థియేటర్స్‌లో రీ రిలీజ్‌కి డేట్‌ని ఇచ్చేశారట. దీంతో మరోసారి థియేటర్లల్లో అవతార్‌ 2ని రీరిలీజ్‌ చేయబోతున్నట్టు సమాచారం.

 

2025 అక్టోబర్‌ 3 నుంచి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుందని తాజాగా ప్రకటన ఇచ్చారు. దీంతో మూవీ లవర్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మరోసారి బిగ్‌స్క్రీన్‌పై ఈవిజువల్‌ వండర్‌ చూసి థ్రిల్‌ అయ్యేందుకు వేచి ఉండలేకపోతున్నామంటూ మూవీ లవర్స్‌ అంత కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇది వరల్డ్‌ వైడ్‌గా ఉంటుందా? లేక కేవలం ఓవర్సిస్‌లోనే రిలీజ్‌ అవుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇండియన్‌ ఆడియన్స్‌ మాత్రం కాస్తా క్యూరియాసిటిగా ఉన్నారు. దీనిపై క్లారిటీ కోసం వారంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.