Tripti Dimri in Spirit Movie: ‘స్పిరిట్’ కోసం ‘యానిమల్’ బ్యూటీ.. హీరోయిన్ ఎవరో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా!

Tripti Dimri Female Lead in Prabhas and Sandeep Reddy Vanga Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రం స్పిరిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ సందీప్ ఈ మూవీ కాస్ట్ వేటలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని రెగ్యూలర్ షూటింగ్‌కు సిద్ధమవుతుంది. దీంతో మూవీ కాస్ట్‌తో పాటు హీరోయిన్ కోసం వేతుకుతున్నారు. ఈ క్రమంలో దీపికా పదుకొనె, ఆలియా భట్, మ్రణాల్ ఠాకూర్ ఇలా పలువురు నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఇందులో డైరెక్టర్ దీపికాని స్పిరిట్ కోసం అనుకున్నారట. కలిసి స్క్రిప్ట్ కూడా వివరించాడట. దీనికి దీపికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే స్పిరిట్లో ఆమె చేయాలంటే రెమ్యునరేషన్ మాత్రమే కాకుండ షేర్స్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. అంతేకాదు వర్కింగ్ విషయంలో పలు కండిషన్స్ పెట్టింది. కేవలం తాను 8 గంటలు మాత్రమే పని చేస్తానని షరతు పెట్టినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపించింది. ఇక దీపికా కోరికలు మితిమీరడంతో సందీప్ రెడ్డి ఆమెను రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపించాయి. దీపిక స్థానంలో ఏ హీరోయిన్ తీసుకుంటాడా? అని ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది.
ఈ క్రమంలో కొందరు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ, సందీప్ రెడ్డి వంగా మాత్రం ఎవరూ ఊహించని హీరోయిన్ స్పిరిట్ కోసం రంగంలోకి దింపారు. తాజాగా హీరోయిన్‌ని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. పాన్ వరల్డ్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా యానిమల్ బ్యూటీ రంగంలోకి దింపారు. ఆమె మరెవరో కాదు.. త్రిప్తి డిమ్రీ. యానిమల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీలోని ఆమె గ్లామర్‌తో కుర్రకారు కట్టిపడేసిన ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాదు కొద్ది రోజుల్లోనే నేషనల్ క్రష్‌గా కూడా మారింది. యానిమిల్‌లోని ఫీమేల్ లీడ్ కంటే కూడా సెకండ్ హీరోయిన్‌గా చేసిన త్రిప్తికి ఫుల్ క్రేజ్ వచ్చింది.
ప్రతి ఒక్కరు ఆమె నామాన్నే జపం చేశారు. అంతగా తన యాక్టింగ్, గ్లామర్‌తో ఆడియన్స్ కట్టిపడేసిన ఈ భామను ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఫిక్స్ చేశాడు. దీంతో త్రిప్తి.. డార్లింగ్ కోసం పర్ఫెక్ట్ మ్యాచ్ అని, సందీప్ రెడ్డి వంగా సెలక్షన్ సూపర్ అంటున్నారు. హీరోయిన్ సెలక్షన్‌లోనే స్పిరిట్ మూవీ పట్ల ఆయన ప్లాన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ భామ సందీప్ రెడ్డి పుణ్యమా అని ఏకంగా డార్లింగ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో త్రిప్తి డిమ్రీ పాన్ వరల్డ్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుందనడంతో సందేహం లేదంటున్నారు ఆమె ఫ్యాన్స్.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోలు ఎలా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్‌గా కనిపిస్తూనే.. మాస్ యాక్షన్‌తో రెచ్చిపోతారు. ఫుల్ రగ్గడ్ అండ్ బోల్డ్‌గా ఉంటారు. అలాంటి డార్లింగ్‌ను పోలీసు ఆఫీసర్‌గా ఎలాంటి రోల్లో దింపుతున్నాడా అని ఎవరి నచ్చినట్టుగా వారు అంచనాలు వేసుకుంటున్నారు. కాగా ప్రభాస్ కెరీర్‌లోనే ఆయన పోలీసుల ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. దీంతో స్పిరిట్‌పై ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడనేది మున్ముందు చూడాలి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Pawan Kalyan Serious on Tollywood: తెలుగు సినీ పెద్దలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అసహనం.. టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.. దానికి తగ్గట్టే ఇకపై పని చేస్తాం!