Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రమోషన్.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది.
బండి సేవలను పార్టీకి వాడుకోవాలనే..( Bandi Sanjay)
బండి సంజయ్‌కి పార్టీలో ప్రమోషన్ దక్కిందనే చెప్పాలి. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇటీవలే బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టారు. అయితే బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ పదవి దక్కలేదు. రాబోయే కాలంలో తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీ యంత్రాంగంలో జోష్ నింపగలిగే వ్యక్తిగా బండి సంజయ్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే బండి సేవలను పార్టీకి వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావించినట్లు సమాచారం.
మరోవైపు బండి సంజయ్‌ని తప్పించిన తీరుపట్ల విమర్శలు రావడంతో అధిష్టానం ఆయనకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో బండి సంజయ్ పార్టీని నడిపించిన విధానంతో అధిష్టానం సంతృప్తి చెందిందని సమాచారం. కారణాలేమయినా గాని బండి సంజయ్ ను తప్పించడంతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న వార్తలు కూడా హల్ చల్ చేసాయి. దీనితో బండి సంజయ్ ను కేంద్రమంత్రిగా కన్నా పార్టీ పదవిలోనే ఉంచితే తమకు లాభంగా ఉంటుందని బీజేపీ పెద్దల భావించారు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని బండి సంజయ్ ఢిల్లీలో కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు.